మీరు బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏ కంపెనీ, ఏ మోడల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా..? లోన్‌కు వెళ్తే ఏయే బ్యాంకులో ఎంత వడ్డీ శాతం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ‘నమస్తే తెలంగాణ’ చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నది. ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్రధాన బ్యాంకులను ఒకే వేదికగా మీ ముందుకు తీసుకొస్తున్నది. నేడు, రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానం (సర్కస్ గ్రౌండ్)లో గ్రాండ్ ఆటో షో నిర్వహిస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ముగిసే ఈ ప్రదర్శనకు ఎంట్రీ ఉచితమని, వివరాలకు 9182777571, 9182777572 సెల్‌నంబర్లలో సంప్రదించాలని ‘నమస్తే’ యాజమాన్యం సూచించింది. ఇంకెందుకు ఆలస్యం! ఆటో షోకు విచ్చేయండి!
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 29 : మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, ద్విచక్ర వాహనం వచ్చినా కరీంనగర్లో కనిపించాల్సిందే! నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే! ఎలక్ట్రిక్ వాహనాలు పరుగులు తీయాల్సిందే! కాలానుగుణంగా వస్తున్న మార్పులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాహనాల వినియోగం పెరుగుతున్నది. వాహనం నిత్యావసరంగా మారిన నేపథ్యంలో ప్రజల్లోనూ ఆధునిక బైక్స్, కార్ల మోడల్స్‌పై ఆసక్తి కనిపిస్తున్నది. చేతిలో పూర్తి స్థాయిలో డబ్బు లేకున్నా.. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లోన్లు ఇస్తుండడంతో రోజురోజుకూ కొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. కంపెనీలు తక్కువ ధరలోనే నయా మోడళ్లను అందుబాటులో ఉంచుతుండడం, ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటించడం కూడా కొనుగోళ్లు పెరగడానికి కారణమవుతున్నది.
ఇటీవలి కాలంలో మన జిల్లాలో వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా వాహనాలు ఇక్కడే అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇండ్ల కంటే కూడా ద్విచక్ర వాహనాలనే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇంటిలోనూ రెండు, మూడు బైక్‌లు కనిపిస్తున్నాయి. గతంలో చేతిలో పూర్తి స్థాయి డబ్బులు ఉంటేనే వాహనం కొనే పరిస్థితి ఉండగా, ఇప్పుడు లోన్లు ఇస్తుండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వాహనంలో ఎన్నో సౌకర్యాలను కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ఈబైక్లపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
నేడు, రేపు ఆటో షో
ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని వివరాలు ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ గొప్ప అవకాశం కల్పిస్తున్నాయి. కరీంనగర్‌లోని జ్యోతిబా ఫూలే మైదానం (సర్కస్‌గ్రౌండ్) వేదికగా శని, ఆదివారాల్లో ఆటో షో నిర్వహిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, ద్విచక్ర వాహనాలు రెండు రోజుల పాటు ప్రదర్శన కోసం వస్తున్నాయి. సరికొత్త మోడళ్ల వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనున్నాయి. సుమారు 20కి పైగా కార్ల కంపెనీలతో పాటు బైక్ కంపెనీలు ఆటో షోలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ వాహనాల సంస్థలతోపాటు రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి.
స్పాన్సర్ కంపెనీలివే..
ఆటో షోకు మెయిన్ స్పాన్సర్స్‌గా ఆదర్శ ఆటో మోటివ్స్ మారుతి సుజికి, ఎరెనా, ట్రూ వాల్యు.. స్పాన్సర్లుగా ఆదర్శ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి సుజికి నెక్సా, కాకతీయ టయోటా, మాలిక్ కియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మహింద్రా మోటార్ లైన్, వల్లభ యమహా మోటార్స్, సిట్రాన్ బీజేఆర్ ఆటో మోటివ్స్, హీరా సుజీకి టూవీలర్, ఎస్ఎస్ ఎలక్ట్రికల్ ఇకో టూవీలర్స్, గ్రీన్ హోండా, ఎంజీ కార్లు, మహావీర్ ఇష్యూజి, ప్రైడ్ జీప్, లక్ష్మి నిస్సాన్ వ్యవహరిస్తున్నాయి.