కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 29 : ఇటీవలి కాలంలో కంపెనీలు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలోనే నయా మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి. మరెన్నో ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఇటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అతి తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి. జీరో డౌన్ పెమెంట్ లేదా అతి తక్కువ డౌన్ పెమేంట్ చేసినా రుణాలు అందిస్తున్నాయి. అయితే వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే వినియోదారులకు ఇబ్బందే. ఆయా కంపెనీల షోరూంల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీని వల్ల సమయం వృథా అవుతుంది.
కానీ, ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ ఏర్పాటు చేస్తున్న ఆటో షోలో అన్ని కంపెనీలకు సంబంధించిన సమాచారం ఒకే వేదికపై దొరుకుతుంది. వాహనాలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. కార్లు, బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల ఫీచర్ల, రాబోయే మోడళ్ల గురించి, లోన్లు, వడ్డీ రేట్ల గురించి ఒకే చోట తెలుసుకోవచ్చని, ఈ చాన్స్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.