Peddapally | సుల్తానాబాద్ రూరల్, జనవరి 5 : ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దుకాణాల ఏర్పాటు కోసం వేలంపాట నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్-కొదురుపాక గ్రామాల పరిధిలోని సమ్మక్క సారలమ్మ జాతర లో దుకాణాల ఏర్పాటు కోసం సోమవారం నారాయణపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బహిరంగ వేల పాట నిర్వహించారు. కొబ్బరికాయలు బెల్లం, లడ్డు పులిహోర, తల్లి ఆరాధన, శీతల పానీయాలు తదితర వాటికి వేలంపాట నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు గుడుగుల సతీష్ కుమార్, ఉత్తమ కుమారి, జాతర కమిటీ చైర్మన్ పొలసాని తిరుపతిరావు, ఉప సర్పంచులు ఎర్రవెల్లి రామారావు, కోదాటి తిరుపతిరావు, ఈవో సదానందం, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ , పంచాయతీ కార్యదర్శి మంగ, మాజీ సర్పంచ్ సాగర్ రావు, వార్డు సభ్యులు, జాతర కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.