Peddapally | పెద్దపల్లి, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత అట్టర్ ప్లాప్ సీఎంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు రాష్ట్రంలో తెర తీశారని, ఈ డ్రామాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంద్ చేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండు సంవత్సరాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లో దోషిగా నిలబెట్టారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేక హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ చేసిన కేటీఆర్‌పై కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకినట్లుగా ప్రజల్లో కేటీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్ర పూరితంగా ఎప్పుడు ఎన్నికల సందర్భం వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.
ఇప్పుడు మళ్లీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఫార్ములా ఈ-కార్ రేసు కేసును తెరమీదికి తీసుకువచ్చారన్నారు. నేడు గ్రామాల్లోకి వెళితే.. ఆ గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని.. హామీలను ఎందుకు నెరవేర్చలేదని, ప్రజలు నిలదీసే అవకాశం ఉండటంతో ఈ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. పరిపాలన చేతగాని సీఎం రేవంత్ కేటీఆర్ ఇమేజ్ను బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలనే కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదన్నారు. ఇంతకు ముందు విచారణకు హాజరై కేటీఆర్ పూర్తిగా సహకరించారన్నారు. న్యాయపరంగా పూర్తిగా ఎదుర్కొంటాం కానీ.. ఈ ప్రజా క్షేత్రంలో మిమ్మల్ని ప్రశ్నించక తప్పదన్నారు.
ఏదో తప్పించుకుందాం అని చూస్తే ప్రజలు మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదన్నారు. రూ.2500లు మహిళలకు ఇస్తామన్నది ఇప్పటి వరకు ఊసే లేదని, రూ.4వేలు వృద్ధులకు పించన్ ఇస్తామని వాటి ఊసే లేదని, విద్యార్థినీ విద్యార్థులకు స్కూటీల ప్రస్థావన అటకెక్కిందని, ఆటో డ్రైవర్లకు భృతి పత్తా లేకుండా పోయిందన్నారు. ఇవన్నింటిపై మిమ్మల్ని ప్రశ్నించక తప్పదని, వదిలే ప్రసక్తే లేదన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి అసలు రద్దు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై విచారణ జరిపించాలన్నారు.
రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ఇమేజ్ను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నాయకులు దోషులుగా నిలబడక తప్పదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు తిరగబడతారని, కొట్లాడుతారని, ఆనాడు ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు పెట్టినా.. ఎంత అణచి వేయాలని చూసినా.. ఎలా లేచామో అలాగే జరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రను ప్రజలు గుర్తించాలని, ప్రజా స్వామిక వాధులు ఈ విషయంలో ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కుట్ర చేసి కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఎక్కడికక్కడ ప్రజలు కాంగ్రెస్ పాలనను అణచేందుకు, స్తంబింపజేసేందుకు కార్యాచరణను తీసుకుంటారన్నారు.
ఇలాంటి చిల్లర డ్రామాలు, నాటకాలు మానుకోవాలని చేతకాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితవు పలుకుతున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పద్దతి మార్చుకోకపోతే.. ఆయన పరిపాలన ఇదే విధంగా చేస్తే బీఆర్ఎస్ ఉద్యమ నాయకత్వం అంతా రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి నీ విధానాలు మానుకో.. దొంగ ఓట్లతోనే చిల్లర రాజకీయ డ్రామాలతోని, డైవర్షన్ పాలిటిక్స్‌ను మానుకోవాలి లేదంటే తగిన శాస్త్రి, బుద్ది చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఒక గొంతు నొక్కితే పదిగొంతులు లేస్తయ్.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ప్రతీ విషయంలో ఏదో ఒక డైవర్షన్, అలవికాని హామీలు వాగ్ధానాలు చేసి ఆరు గ్యారెంటీలను 420హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఉన్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసం ఫార్ములా ఈ కార్ కేసును తెరమీదికి తెచ్చారన్నారు. గవర్నర్ ద్వారా అనుమతి ఇవ్వడం కుట్ర పూరితమైన ఆలోచన, అవసరం లేని ఆలోచన అన్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ఆలోచనలు చేస్తామని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేస్‌ను ఒక మంత్రిగా కేటీఆర్ తీసుకువచ్చారన్నారు.
కొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు ఇలాంటి కుట్రలకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రతీది కుట్రతో.. అబద్దాలతో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మీరు ఎన్ని ఆలోచనలు చేసినా.. ప్రజలకు మీరు చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాటలతో కాలయాపన చేస్తూ సమస్యలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దగా.. ప్రజల సంక్షేమం కోసం.. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతి పక్షం గొంతు క్కాలనుకుంటే.. ప్రజలు మీ గొంతే క్కుతారనే విషయాన్ని గుర్తించాలన్నారు.
ఒక గొంతు క్కితే.. పది గొంతులు లేస్తాయని, పది గొంతులు క్కితే వంద గొంతులు, వేల గొంతులు లేస్తాయన్నారు. ఎంత అణచి వేస్తే అంత ఉవ్వెత్తున బీఆర్ఎస్ లేస్తుందన్నారు. మీరు చేసే తప్పులకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఇలాంటి తప్పుడు ఆలోనచలు, తప్పుడు విధానాలకు స్వస్థి పలకాలన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముందుకు వస్తాయన్నారు. వాళ్లే బుద్ది చెబుతారని హితవు పలికారు. ఇప్పటికైనా ఇలాంటి విధానాలను మానుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు అయిలయ్య యాదవ్, ఉప్పు రాజ్‌కుమార్, నారయణదాస్ మారుతి, అడప శ్రీనివాస్, బోండ్ల అశోక్, మెతుకు దేవరాజు, కల్వచర్ల కృష్ణవేణి, కవిత సరోజిని, బాదె అంజలి, కవ్వంపల్లి కనకలక్ష్మి, సంధ్యారెడ్డి, లక్ష్మి, గురం పద్మలతో పాటు పలువురు ఉన్నారు.