Gangadhara | గంగాధర, అక్టోబర్ 27: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు. ఏడాదికాలంగా యాకూబ్ పాషా కీచక పర్వం కొనసాగుతోంది. ఏడాది క్రితం విద్యార్థులు విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసిన చర్యలు తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అయినా పద్ధతి మార్చుకోకుం రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు. ఏడాదికాలంగా యాకూబ్ పాషా కీచక పర్వం కొనసాగుతోంది. డా విద్యార్థులను నిత్యం వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
ఉపాధ్యాయులకు తెలిపిన పట్టించుకోకపోవడంతో వేధింపులను ఏడాది కాలంగా విద్యార్థులు పంటి బిగువున భరిస్తున్నారు. గత శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన సభా కార్యక్రమంలో సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల జిల్లా సంక్షేమ శాఖ, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నిందితుడు యాకూబ్ పాషాను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాఠశాలలో ఏడాదికాలంగా విద్యార్థులపై వేధింపులు జరుగుతున్న ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
యాకూబ్ పాషా కప్పి పెట్టడానికి ఉపాధ్యాయుని ప్రయత్నించారని, ఇంత జరుగుతున్నా కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి విచారణ చేసి రాజులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలో విచారణ చేశామని పాఠశాలలో విచారణ చేశామని. నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని డిసిపిఓ పర్వీన్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకుంటామని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు తెలిపారు.