Rasamayi Balakishan | మానకొండూరులో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పై ప్రశ్నిస్తే దాడులు చేస్తన్నారని, రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
- ప్రజల మద్దతుతో గెలిచిన వారిపై దాడి చేయడం దుర్మార్గం
- మొగిలిపాలెంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజం
Rasamayi Balakishan | తిమ్మాపూర్, సెప్టెంబర్ 11 : మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి పై ప్రశ్నిస్తే దాడులు చేస్తన్నారని, రౌడీ రాజ్యం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి డైరెక్షన్లు ఇస్తూ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మొగిలిపాలెం సర్పంచ్ తట్ల తిరుపతిపై గురువారం దాడి జరగగా రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మండల నాయకులు పరామర్శించారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి వెళ్లిన సర్పంచ్ తిరుపతిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో ఆ పార్టీలో ఎవరూ చేరడం లేదని, దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే సూచన మేరకే దాడులు జరుగుతున్నాయన్నారు.
ఈ దాడి ముదిరాజ్, రజక జాతులపై జరిగిన దాడినని, దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సొసైటీ చైర్మన్గా ఉన్న రమణారెడ్డి రైతులు యూరియా అడిగితే కూడా దాడులు చేస్తావా అని దుయ్యబట్టారు. తమ సర్పంచులు తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. కవంపల్లి సత్యనారాయణ అతన్ని పార్టీ నుంచి, సొసైటీ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో దళితుల గురించి మాట్లాడే కవ్వంపల్లి దళితుడినైన తన దిష్టిబొమ్మ దహనం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. తాను నియోజకవర్గాన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తే, ఎమ్మెల్యే రౌడీ రాజ్యం నడిపిస్తున్నాడని మండిపడ్డారు. అంతకుముందు నుస్తులాపూర్ నుండి భారీ కార్లతో ర్యాలీ తీశారు. మొగిలిపాలెం చేరుకొని ఘటనపై ఆరా తీశారు. అనంతరం సర్పంచ్ తిరుపతి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

