SINGARENI | రామగిరి ఏప్రిల్ 17: రామగుండం-3 పరిధిలోని ఓసిపి-2 ఉపరితల గని విస్తరణలో భాగంగా 88 ఎకరాల భూమిని సేకరించేందుకు బుధవారంపేట లో అధికారులు గురువారం భూ సర్వే చేస్తున్నారు. కాగా అక్కడ రైతులు కాకుండా వేరే వ్యక్తులు అడ్డుకొని సర్వే పరికరాలు ధ్వంసం చేస్తుండగా ఆ సమయంలో అడ్డుగా అడిషనల్ మేనేజర్ కోల శ్రీనివాస్ అడ్డుగా వెళ్లారు.
కాగా అతడిపై దుండగులు దాడి చేయగా అతడికి గాయాలు అయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. బాధితుడిని చికిత్స కోసం సెంటినరీ కాలనీ డిస్పెన్సరీ తరిలించారు. చికిత్స పొందుతున్న కోల శ్రీనివాస్ ను రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించి మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితుడిని గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా దవఖానకు తరలించారు. దాడి చేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఏరియా అధికారులు తెలిపారు.