Electrical accident | వీర్నపల్లి, అక్టోబర్ 6 : విద్యుత్ ప్రమాందంలో అసిస్టెంట్ హెల్పర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జవహర్ నాయక్ తండా పరిధి బంగిరెడ్డి తండాలో సోమవారం చోటుచేసుకుంది. అదే గ్రామంలో అసిస్టెంట్ హెల్పర్ గా పనిచేస్తున్న భూక్య పరమేష్ ఫీజు వైరు సరి చేయడానికి ట్రాన్స్ పార్మర్ ఎక్కాడు.
విద్యుద్ఘాతం సంబవించి తీవ్ర గాయాలతో ట్రాన్స్ పార్మర్ పైననే అచేతన స్థితిలో పడిపోయాడు. అక్కడే ఉన్న రైతులు గమనించి ట్రాన్స్ ఫార్మర్ పైనుంచి పరమేశ్ ను కిందకు దింపారు. చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం పరమేశ్వర్ పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స పొందుతున్న పరమేష్‌ను సెస్ అధికారులు పరామర్శించారు.