Ashwini Tanaji Wakade | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 17 : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో భాగంగా జిల్లాలో లోకల్ బాడీస్ విభాగం బాధ్యతలు నిర్వహించిన అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ కరీంనగర్ బల్దియా కమీషనర్ గా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ అశ్విని తానాజీ అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు.
2020 బ్యాచ్‌కు చెందిన ఈమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, డివిజనల్ రెవెన్యూ అధికారి మహేశ్, కలెక్టరేట్ కార్యనిర్వహణాధికారి గడ్డం సుధాకర్‌తో పాటు ఇతర ప్రభుత్వశాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఉద్యోగ సంఘాల నాయకులు, టీఎన్జీవోల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ డ్డి, నాయకులు హర్మిందర్ సింగ్, నర్సింహాస్వామి, శారద, నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి, తదితరులు అదనపు కలెక్టర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.