Garrepalli | సుల్తానాబాద్ రూరల్, జనవరి 27 : గర్రెపల్లి గ్రామంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర కమిటీ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పూర్తిచేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఈనెల 28 నుంచి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. రంగులతో అందంగా ముస్తాబు చేయడంతో పాటు విద్యుత్ దీపాల అలంకరణ, చలువ పందిర్లు , తాగునీరు, భక్తులకు వసతులు, స్థానపు ఘటాలు, తదితర ఏర్పాట్లు చేశారు.