Polycet-2025 | పెద్దపల్లి రూరల్ మే12: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా 2,488 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన పేర్కోన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటున్నామని వివరించారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ద్వారా పాలిసెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు అవసరాలపై రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ , ఆరోగ్యశాఖలకు పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్ల లో సహకరించాలని ఆదేశాలు వెళ్లాయన్నారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో చీప్ సూపరింటెండెంట్ల లకు పలు సూచనలు సలహాలు పరీక్ష నిర్వహణకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 1.30 వరకు నిర్వహించబడునని, విద్యార్థులను ఒక గంట ముందు నుండే పరీక్ష హాలు లోకి అనుమతిస్తారని, విద్యార్థులు హాల్ టికెట్లు ,పెన్సిల్, పెన్ తో సహా పరీక్ష సెంటర్ కి గంట ముందుగానే చేరుకోవాలని చెప్పారు. 11 గంటలకు ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించేది లేదని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచించారు.