తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడిజిల్లావ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సమీకృత కలెక్టరేట్లను విద్యుద్దీపాలతో అలంకరించింది.
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజన్నసిరిసిల్లలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లిలో మండలి చీఫ్‌విప్ తానిపర్తి భానుప్రసాద్‌రావు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం వేడకలకు హాజరైన ప్రజలనుద్దేశించి సమైక్యతా సందేశాన్ని ఇవ్వనున్నారు. కళాకారులు, విద్యార్థులు ఆటపాటలతో ఆహూతులను అలరించనున్నారు.