SIRICILLA | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 10 : సాయుధ పోరాట యోధుడు, కామ్రేడ్ దివంగత సింగిరెడ్డి భూపతి రెడ్డి కూతురు సత్తవ్వ తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ లో బుధవారం ఆమె మృతి చెందింది. కాగా సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు సత్తవ్వ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు.
ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు మిట్టపల్లి జవహర్ రెడ్డి, ఆత్మకూరీ చంటి యాదవ్, మల్లారెడ్డి , రాంరెడ్డి, నాయిని సాయి కృష్ణ, రఘు, స్థానిక నేతలు ఉన్నారు. అదే విధంగా సెస్ లైన్ మెన్ రాజేశం తల్లి శంకరవ్వ ఇటీవలే మృతి చెందారు. లైన్ మెన్ రాజేశంని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పరామర్శించారు. వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.