‘కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హర్ష్ రోషన్, శ్రీదేవి. వీరిద్దరూ ‘బ్యాండ్‌మేళం’ చిత్రంతో మరోమారు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మించారు. మార్చి 13న విడుదలకానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు.
‘తాళికట్టడం కలిసి ఉండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టిన దానికి కాదురా..చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా’ అని స్టోరీ నరేషన్ సందర్భంగా దర్శకుడు చెప్పిన డైలాగ్ నచ్చి ఈ సినిమాకు శ్రీకారం చుట్టానని నిర్మాత కోన వెంకట్ తెలిపారు. తెలంగాణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ ఇదని, ప్రతీ సీన్లో ఎమోషన్స్ పండాయని దర్శకుడు పేర్కొన్నారు. హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీగా అందరిని ఆకట్టుకుంటుందని నాయకానాయికలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: సతీష్ జవ్వాజి.