హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన తర్వాత గ జం భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వివాదాల్లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిందన్న ప్రచా రం పూర్తిగా అవాస్తవమని పేరొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములకు సంబంధించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలు, ప్రజల ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న భూములను గుర్తిస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. 22 ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత వ్యవధిలో పరిషరించాలని ఆదేశించారు. తహసీల్దార్, ఆర్డీ వో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని, కలెక్టర్లదే తుది నిర్ణయమని గుర్తుచేశారు.