Appointment | ధర్మారం, సెప్టెంబర్ 26 : ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ మండల ఉపాధ్యక్షులుగా కర్రె లక్ష్మణ్, దేవి కొమరేష్, సామంతుల కిరణ్, బైరి శేఖర్, ప్రధాన కార్యదర్శిలుగా కుందేళ్ల కిరణ్, దేవి రాజ లింగయ్య ,గోనె సాయి, కార్యదర్శులుగా, జనగామ సంజీవ్, చీకట్ల శేఖర్,పల్లె లక్ష్మణ్,సాగంటి నర్సయ్య, కోశాధికారిగా కేశవేణి నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా నాడెం మల్లేశం,మల్యాల వెంకటేష్,శాఖపురం వెంకటేష్, గడ్డం రాజేశ్వర్ రెడ్డి ,కుంట రాజిరెడ్డి, వన్నెల బాల్ రెడ్డి నియమించినట్లు ఆయన వివరించారు.
అదేవిధంగా పార్టీ అనుబంధ యువ మోర్చా మండల అధ్యక్షుడిగా మామిడి చందు, దళిత మోర్చా మండల అధ్యక్షుడిగా అత్రిపత్రి రమేష్, ఎస్సీ, ఎస్టీ మండల అధ్యక్షుడిగా రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా గా దీటి మల్లయ్యను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల పార్టీలో చేరిన ధర్మారం మండల కేంద్రానికి చెందిన దేవి రాజలింగయ్యను జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మపురి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీ కన్నం అంజయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొమ్ము రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మారం మండల పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు.