కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 25 : 2025-26 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు అందజేయనున్న వివిధ రకాల ఉపకరణాల కోసం ఈ నెల 27 వరకు దరఖాస్తులు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
శారీరక దివ్యాంగులు, అంధులు, బధిరులు, మానసిక దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికిల్స్, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ వీల్‌చైర్, లాప్టాపులు, కాలిపేర్స్, 4జీ స్మార్ట్ఫోన్లు, ట్రై సైకిళ్లు, ఆర్టిఫిషల్ లింబ్స్, క్రచెస్, వాకింగ్ స్టిక్స్, స్మార్ట్ కేన్స్, బ్రెయిలీ బుక్స్, కిట్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎంఆర్సీ చప్పల్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
అర్హులైన వారు వెబ్సైట్ (http://tgobmms.cgg. gov.in//) అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎంపిక కమిటీ పరిశీలించి, అర్హలకు గుర్తించి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకోసం నగరంలోని జడ్పీ కార్యాలయ ఆవరణలో గల జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని స్పష్టం చేశారు.