Devampalli Gurukulam | మానకొండూర్ రూరల్, డిసెంబర్ 28 : గురుకులాల్లో ఒకప్పటి పరిస్థితులకు భిన్నంగా మారుతున్నాయి. ఒక్కప్పుడు చదువులకు నిలయంగా ఉన్న గురుకులాలు నేడు అందుకు భిన్నంగా దాడులకు నిలయంగా మారుతున్నాయి. ఇక్కడ చదువులేమో గాని దాడులకు, ప్రాణాలకు వసతి లేకుండా పోగా, వసతి గృహంలో వసతులు లేక పోవడంతో విద్యార్థుల తల్లి దండ్రులే రోడ్డెక్కిన సంఘటనలు జరిగాయి. ఇటీవల పదో తరగతి విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని, ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు అసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఆలస్యంగా జరిగింది. వెలుగులోకి వచ్చింది. అసలు దేవంపల్లి గురుకులంలో ఏం జరుగుతుందో విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
బాధిత విద్యార్థి తల్లి దండ్రుల కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం దేవంపల్లి గురుకుల పాఠశాలలో కేశవపట్నంకు చెందిన కాశిపాక సుమలత-సంపత్‌ల కుమారుడు తనయ్ దేవంపల్లి గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు. మరో విద్యార్థి జగిత్యాలకు చెందిన మరో విద్యార్థి కూడా ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వీరి ఇరువురి సెక్షన్లు వేర్వేరు అయినప్పటికి వీరి మధ్య మాట పెరిగి (డిసెంబర్ 11న) హేళనగా మాట్లాడడంతో దాడి చేశారు. ఈ దాడిలో తనయ్ను మరో విద్యార్థి దాడి చేయడా తీవ్రంగా గాయపడ్డాడు.
పాఠశాల నుండి సమాచారం అందడంతో వెంటనే హుటాహుటిన తనయ్ తల్లి దండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. అసుపత్రికి తీసేకెళ్లి డాక్టర్‌కి చూపించడంతో సర్జరీ చేయాల్సి వస్తుందని, అందుకు ఖర్చు అవుతుందని చూశారు. వెంటనే బాధిత తల్లి దండ్రులు అప్పటి ఇన్చార్జి ప్రిన్సిపాల్ గోలి జగన్నాథంకు కలవగా తరువాత మాట్లాడుతామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని డిసెంబర్ 15న గురుకుల పాఠశాలకు రావడంతో పాఠశాలలో ఇప్పటికే ఏదో గొడవ పడ్డారనే సమాచారంతో ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదని వెళ్లినట్లు చెప్పారు.
అనుపత్రిలో చికిత్స పొందుతున్న తనయ్ పరిస్థితిని ప్రిన్సిపాల్ కు వివరించిన స్పందించలేదని వాపోయారు. ఇప్పటికే తన కుమారుడి అనారోగ్యంతో చూడాల్సి వస్తుందని, ఆర్థికంగా నష్టపోయామని, మరో నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందని డాక్టర్లు తెలిపారని, దీంతో తమ కుమారుడి చదువును సైతం కోల్పోయే పరిస్థితి వచ్చిందని తమ బాధను వివరించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.