సిరిసిల్ల రూరల్, మార్చి 25: సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూంలో కడిగే యాసిడ్ తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఇందిరమ్మ కాలనీ (టెక్స్ టైల్ పార్క్)కి చెందిన పరికిపెల్లి రాజుకు (53) భార్య పద్మ, కొడుకు రాకేష్, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రాజు మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కూతుర్లు, కొడుకు వివాహం కూడా జరిపించారు. కాగా, రాజుకు గత రోజులుగా సరైన పని లేక ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తరచూ మద్యం సేవిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతొ గొడవ పడ్డాడు.
దీంతో మన స్థాపం చెందిన రాజు ఇంట్లోని బాత్రూంలు కడిగే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ దవఖానలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రాజు మృతితో ఇందిరమ్మ కాలనీలో విషాదం నింపింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.