foxo case | మెట్పల్లి, మే 24: జగిత్యాల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన ఏడేళ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వాసనీయ సమాచారం ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని ఓ కాలనీలో ఒంటరిగా ఉంటున్న వృద్ధుడు ( 68) తన ఇంటికి సమీప ఇంటిలో ఉండే ఓ బాలిక వారం రోజుల క్రితం ఆడుకునేందుకు రాగా తన సెల్ఫోన్ ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడగా అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడైన వృద్ధుడిని జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు సమాచారం.