Animal lover | చిగురుమామిడి, సెప్టెంబర్ 29 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోలుగురి లోకేందర్ (44) జంతు ప్రేమికుడు గుండెపోటుతో సోమవారం నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆదివారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. శాతవాహన యూనివర్సిటీలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. లోకేందర్ గ్రామంలో అందరితో ఆత్మీయంగా కలిసి ఉండేవాడు. చిన్నతనం నుండే జంతువుల పట్ల అపారమైన మక్కువతో వందలాది కుక్కలను పెంచేవాడు. బీద కుటుంబానికి చెందిన వాడు కావడంతో గ్రామస్తులు అతని స్నేహితులు దహన సంస్కారాలకు విరాళాలు అందజేయాలని గ్రామస్తులను కోరారు. 7382980 675 నంబర్ కు ఫోన్ పే, లేదా గూగుల్ పే చేయాలని అతని మిత్ర బృందం కోరారు.