కార్పొరేషన్, జూలై 30: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య వాహనాలను మరమ్మతులో నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని మున్సిపల్ కా ర్మికులు టోకెన్ సమ్మెకు సిద్ధమ య్యారు. ఆగస్టు 8 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు మం గళవారం నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కు నోటీసులను బీఆర్టీయూ, సీఐటీ యూ సంఘ నాయకులు అందించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బల్దియా లో పనిచేస్తున్న కార్మికుల సంఘాలు బీఆర్టీయూ (కరీంనగర్ మున్సిపల్ కాంట్రక్టు వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్), సీఐటీయూ (తెలంగాణ మున్సిపల్ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్)జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. చెత్త సేకరణ చేస్తున్న వాహనాలు ట్రాక్టర్లు. స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్ వాహనాలు, డం పర్ ప్లేసర్ వ్యాన్, ట్రాక్టర్లకు రెండేండ్లుగా మ రమ్మతు చేయడం లేదని పేర్కొన్నారు.
చెడిపోయిన వాహనాలను నడిపేందుకు డ్రైవ ర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపా రు. అధికారులు మాత్రం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెం టనే స్పందించాలని అన్ని వాహనాలను బంద్ చేసి టోకెన్ సమ్మెలోకి వెళ్తామని తేల్చిచెప్పారు. పారిశుధ్య కార్మికులకు వా న కాలంలో ఇవ్వాల్సిన రెయిన్ కోట్లు మూ డేండ్లుగా ఇవ్వడం లేదన్నారు. వర్షంలో నా నుతూ రోగాల బారిన పడుతున్న కార్మికులను ఆదుకోవాలని, మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వయస్సుతో నిమిత్తం లేకుండా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 8 నుంచి పా రిశుధ్యం, వాటర్ వర్స్, హరితహారం విభాగాల్లో పనిచేసే వారందరూ సమ్మెలో పా ల్గొంటారన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, జనగాం రాజమల్లు , జనగం రాజమల్లు, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ బీఆర్టీయూ అధ్యక్షు డు పొన్నం లింగయ్య, నగర అధ్యక్షులు గ డ్డం సంపత్, నాయకులు రవీందర్, మా తంగి లక్ష్మణ్, దాసరి రాజమల్లయ్య, రవి, మల్లేశం, సుంకరి లక్ష్మణ్ పాల్గొన్నారు.