Peddapally | పెద్దపల్లి, నవంబర్ 12: అందె శ్రీ అకాల మరణం తెలంగాణ సమాజానికి, సాహితీ లోకానికి తీరని లోటు అని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ప్రజా కవి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ర్ట సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో పాటలు, సాహిత్యంతో అందె శ్రీ కీలక పాత్ర పోషించడని పేర్కొన్నారు. అందె శ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ దు:ఖ సాగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇక్కడ ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపాల్, ఉపాధ్యక్షుడు తిర్రి తిరుపతి గౌడ్, కోశాధికారి అరెల్లి మల్లేష్, పాత్రికేయులు కాల్వ రమేష్, లైశెట్టి రాజు, రాజమల్లు, సుధాకర్ గౌడ్, వంశీ కృష్ణ, నాగపూరి తిరుపతి, తోట సతీష్, అనకట్ల ప్రసాద్, మాచర్ల వంశీ, అడ్డగుంట రాజేందర్, మారుపాక అంజి, మేకల సంతోష్, నాగిశెట్టి శ్రీనివాస్, కత్తర్ల తిరుపతి, ఉమేష్, సాబీర్ పాషా, తిరుపతి, సాయి వంశీ, షెకిల్ తదితరులు పాల్గొన్నారు.