Nustulapur | తిమ్మాపూర్, జులై 13: తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత తిరిగి పాఠశాలలో కలిశారు. ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఆనాటి మ్యాథ్ ఉపాధ్యాయుడు మాధవరెడ్డి కార్యక్రమానికి హాజరు కాగా గురుపూజ నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం గత స్మృతులను నెమరు వేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మతీన్, అనంతోజు శ్రీకాంత్, జ్యోతి, జగదీశ్వర చారి, షఫీ ఉద్దీన్, కుమార్, రాజమల్లు, అంజని, రాజ్ కిరణ్, సదానందం తో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.