SULTANABAD | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 27 : సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన 1982-83 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నరసయ్య పల్లె గ్రామ శివారులోని విజయ గార్డెన్స్ లో నిర్వహించారు. అప్పటి గురువులు కె సాంబయ్య, బీ రఘు, బీ రామచంద్ర రెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు లు ముఖ్యఅతిథిలు గా హాజరై ఆశీస్సులు అందజేశారు. అన్ని బంధాల కంటే స్నేహబంధమే గొప్పదని అన్నారు. ప్రస్తుతం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మానవ సంబంధాల మనుగడ ప్రమాదం అంచున పయనిస్తోందన్నారు.
మానవ సంబంధాలను పెంపొందించుకోవాల్సిన అవసరముందని గురువులు సూచించారు. ఈ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ముందర మృతి చెందిన పూర్వ విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ చైర్మన్ కడారి అశోక్ రావు, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మిన్హాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి పురం హరికిషన్, ఉపాధ్యక్షులు రమాదేవి, సామల హరికృష్ణ, వల్స నీలయ్య, దేవయ్య, మధుసూదన్ రెడ్డి, అంజమ్మ, మల్లేశం, కే మల్లయ్య, కే రాజయ్య, కే శ్రీనివాస్, కే శంకరయ్య, రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.