Rudrangi | రుద్రంగి, మే 31: రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2000-01 సంవత్సరంలో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకొని ప్రస్తుత అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో స్నేహితులు పదో తరతగతి వరకు కలిసి ఉంటారని, వారి బంధం విడదీయలేనిదని అన్నారు. అనంతరం వారికి విద్యాబోధనలందించిన అప్పటి ఉపాధ్యాయులను షాలువతో సన్మానించి ప్రతి ఒక్కరు గురువులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి గురువులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.