Godavarikhani | కుట్టు మిషన్ల పంపిణీలో అవకతవకలపై విచారణ జరపాలి.. 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మైనార్టీలకు కుట్టు మిషన్ల పంపిణీలో పారదర్శకత కొరవడిందని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆరోపించారు. గోదావరిఖనిలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు.
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 29 : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మైనార్టీలకు కుట్టు మిషన్ల పంపిణీలో పారదర్శకత కొరవడిందని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆరోపించారు. గోదావరిఖనిలో ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. తమ డివిజన్లో కుట్టు మిషన్ల లబ్ధిదారుల జాబితాను అడిగితే నగర పాలక అధికారులు ఎప్పటిలాగే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. తమ డివిజన్లోని అర్హులైన మైనార్టీలు కుట్టు మిషన్లు రాలేదని తన దృష్టికి తీసుకరావడంతో ఈ విషయమై నగర పాలక అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రావడం లేదన్నారు. డివిజన్ ప్రజాప్రతినిధికి లబ్దిదారుల జాబితా అందించకపోవడం వెనుక మతలబు ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే కుట్టు మిషన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తారా..? అని అధికారులను ప్రశ్నించారు.
మొదటి నుంచి మహిళా ప్రజాప్రతినిధిగా తన పట్ల మున్సిపల్ అధికారులు అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్ లోని కొందరు మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురి చేసి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1000 చొప్పున మధ్య దళారులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయనీ, ఈ విషయంపై నగర పాలక కమిషనర్ నిష్పక్షపాతంగా విచారణ జరిపించి జాబితాలో అనర్హులను తొలగించి అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు అందేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పారదర్శకత కోసం వెంటనే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను చితకబాదిన కిష్టమ్మ.. వీడియో
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

