Anganwadi building | పెగడపల్లి: పెగడపల్లి మండలం నంచర్ల లో అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణ పనులకు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ బూర రాములు గౌడ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో భవన నిర్మాణ పనులకు రూ.12 లక్షల నిధులు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి పిల్లలకి అందుబాటులో తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ షంషేర్ అలీ, పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, స్థానిక నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, కుంటాల అంజయ్య, కుంటాల బాబు, సాయిళ్ళ రాకేష్, సూర అంజి తదితరులు పాల్గొన్నారు.