Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్5 : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా టీ జంక్షన్ వద్దగల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగింపు అనేది ఉండదని, నగర ప్రజలు అపోహలు నమ్మొద్దని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జే అరుణశ్రీ తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరిఖని బస్టాండ్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో అంబేద్కర్ విగ్రహం తొలగిస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు ఇటువంటి అపోహలను నమ్మొద్దని, రోడ్డు వెడల్పులో విగ్రహాల తొలగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, ప్రజలు అనవసర ఆందోళనకు గురి కావద్దని ఆమె పేర్కొన్నారు.