Jagjivan Ram | కోల్ సిటీ, జూలై 6: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళిత వర్గాలకు రెండు కళ్లలాంటివారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ 49వ వర్ధతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దళిత, అణగారిన వర్గాలకు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
చిన్న వయసులోనే 40 ఏళ్లకు పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పని చేశారన్నారు. దళిత, అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆయన కృషి అజరామరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగరాజు. హైకోర్టు న్యాయవాది గొర్రె రమేశ్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్, వివిధ రాజకీయ పార్టీల, సంఘాల నాయకులు తిప్పారపు శ్రీనివాస్, బొంకూరి మధు, మైస రాజేశ్, కనుకుంట్ల సమ్మయ్య, ఎండీ ముస్తఫా, గట్ల రమేశ్, దూళకట్ట సతీశ్, దాసరి విజయ్, నారాయణదాసు మారుతి, నీరటి శ్రీనివాస్, శ్రావణ్, వెంకటేశ్, మహేశ్, ఆకునూరి బాల అంకుస్, దుబాసి బొందయ్య, శనిగరపు రామస్వామి, నర్సింగరావు, మహేందర్, శంకర్, వెంకటేష్, రామస్వామి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.