Regunta school | మల్లాపూర్, జూలై 4: మండలంలోని రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కొంత కాలంగా నీటి వసతి లేక విద్యార్థులు, ఉపాద్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఆల్ యూత్ అసోషియేషన్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గణవేని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ సభ్యుల గ్రామస్థుల సమిష్టి సహకారంతో నూతన బోరు బావి మోటార్ కోనుగోలు చేసి పాఠశాలలకు శుక్రవారం అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తమ సంఘం ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పనకు ఎల్లావేళాల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పవన్, రాజేష్, బషీర్, అశోక్, నరేష్, హబీబ్, ప్రకాష్, హెచ్ఎంలు రాజు, నర్సింగరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.