Unanimous | పెగడపల్లి: పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు అన్ని ఏకగ్రీవం కానున్నాయి. గ్రామానికి చెందిన 8 వార్డు స్థానాలకు గాను, ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో దాదాపుగా వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
అధికారులు నామినేషన్ పత్రాలను శనివారం పరిశీలించారు. కాగా ఇక్కడ అన్ని నామినేషన్ పత్రాలను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇక్కడ సర్పంచ్ జనరల్‌కు రిజర్వు కావడంతో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.