పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 23 : విద్యార్థులంతా చదువుకునే దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని శాతవాహన యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఇ మనోహర్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో ప్రభుత్వ బాలుర కళాశాల, గౌరెడ్డిపేటలో ప్రభుత్వ బాలికల కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరాలను మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఇ మనోహర్ మాట్లాడుతూ.. విద్యార్థులుగా చదువుకునే దశలోనే సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగేందుకు ప్రణాళికలు చేసుకుని విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు. ప్రధానంగా చదువుకునే సమయంలో మత్తు పదార్థాలతో పాటు ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడి అన్ని విధాలా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కె. సదయ్య, డి.నరహరి, పంచాయతీ కార్యదర్శులు తిరుపతి, అశోక్, అధ్యాపకులు దీప, నవ్య, అశోక్, రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.