కరీంనగర్ కమాన్చౌరస్తా, జూలై 17 : నీట్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 19 మంది 500కుపైగా మార్కులతో సత్తాచాటారు. ఈ సందర్భంగా కరీంనగర్ వావిలాలపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయగా, విద్యాసంస్థల చైర్మన్ డార్టర్ వీ నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
డీ రిత్విక్ 647 మారులతో అత్యున్నత స్థానంలో నిలిచాడని, సిద్దాంత్ చతుర్వేది 564, సయ్యద్ మలాజుద్దీన్ 557, వసుల శ్రుత్విక 551, గులామ్ మహమ్మద్ హుస్సేన్ 548, బత్తుల అభిజ్ఞ 541, లింగంపల్లి అనంత్సాయి 540, నార్ల శ్రీహిత 538, శ్రేయాంశ్ ద్వివేది 537, కొండ్ల అక్షిత 522, బొమ్మవరపు రుత్విక్ 515, జకుల శ్రీవైత్రి 512, టీ హర్షిత 509, సిద్ధం సాత్విక 508, ఏ సత్యబ్రాహ్మిణి 507, బీ అక్షర 505, నిద 502, గుంజేటి రిషిత 501, జహ్రా మాజీద్ 501 మారులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని హర్షం వ్యక్తం చేశారు.
నీట్ కోచింగ్ డాక్టర్స్-30 ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా కోచింగ్ అందించడంతో అల్ఫోర్స్ విజయపరంపర కొనసాగుతుందన్నారు. తమ విద్యార్థులు సుమారు 100 మందికి పైగా ప్రతిష్ఠాత్మక మెడికల్ కళాశాలలలో సీట్లు సాధించగలరని ధీమా వ్యక్తం చేశారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోదన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అకుంటిత దీక్ష, పట్టుదల, కృషి వల్ల ఇంతటి ఘన విజయం సాధించామని చెప్పారు. రాబోయే రోజుల్లో అత్యధిక మంది అల్ఫోర్స్ విద్యార్థులు మెడికల్, ఐఐటీ, ఎన్ఐటీలలో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.