Appointed | సారంగాపూర్, డిసెంబర్ 29 : సారంగాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు మండల కేంద్రంలో సోమవారం సమావేశమై మండల సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేష్, గౌరవ అధ్యక్షుడిగా రేచపల్లి సర్పంచ్ బాస మహేష్, ప్రధాన కార్యదర్శిగా మ్యాడారం తండా సర్పంచ్ భుక్య భారతి చిరంజీవి, ఉపాధ్యాక్షుడిగా సారంగాపూర్ సర్పంచ్ చేకూట అరుణ శేఖర్, జాయింట్ సెక్రెటరీగా కొత్తురి పుష్పనాథ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గడ్డం గంగారం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దామోర రుషేంద్ర, కన్వీనర్ చెట్లపల్లి రమ, కో-కన్వీనర్ గా మాల్యాల జ్యోతి శ్రీనివాస్‌తో పాటు ఇద్దరు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఎంపీడీఓ సలీం, తహసీల్దార్ వహిదొద్దిన్లను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులను అభినందించారు. అధికారులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని సర్పంచులు పేర్కొన్నారు.