Peddapally | పెద్దపల్లి, అక్టోబర్ 1 : పెద్దపల్లి జిల్లా అసిస్టెంట్ ఆడిట్ అధికారిగా అగుమామిడి అఖిల్‌రెడ్డి ఎంపికయ్యారు. కాగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన అగుమామిడి అఖిల్ రెడ్డి 475.5 మార్కులతో 176 వ ర్యాంక్ పొంది పెద్దపల్లి అసిస్టెంట్ ఆడిట్ అధికారిగాగా ఎంపికయ్యారు. కాగా ఈ సందర్భంగా కలెక్టర్ అఖిల్ రెడ్డిని అభినందించారు.