General strike | జగిత్యాల, మే 12 : ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐయూటిసీ రాష్ట్ర నాయకులు సమ్మయ్య కోరారు జగిత్యాల లో సోమవారం సమ్మె పోస్టర్ ను నాయకులతో కలిసి సమ్మయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమయ్య మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ లను రద్దు చేసి, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మే 20న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె లో అసంఘటిత, సంఘటిత రంగం కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూ సి జిల్లా కార్యదర్శి ఎండీ ముక్రమ్, సాయిశ్వరి, వెన్న మహేష్, ఎం కిరణ్, సుమలత, వనిత, మమత, ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోనగిరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.