Lions Club | ధర్మారం, జనవరి 20: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. కాగా అతడి నేత్రాల అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. దీంతో నేత్రాలు సజీవంగా ఉండిపోయాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల కథనం ప్రకారం.. రచ్చపల్లి గ్రామానికి చెందిన ఐత చంద్రయ్య (70) అనే వృద్ధుడు అనారోగ్యంతో మంగళవారం మరణించాడు.
దీంతో సదరు వృద్ధుడి నేత్రాలు దానం చేయాలని అతడి కుమారుడు వెంకటేశం సంకల్పించాడు. దీంతో గోదావరిఖని ప్రాంతానికి చెందిన లయన్స్ క్లబ్ వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు నేత్ర వైద్యులతో కలిసివచ్చి సదరు వృద్ధుడి నేత్రాలు సేకరించి తీసుకెళ్లారు. ఆ వృద్ధుడి నేత్రాలు దానం చేయడం వల్ల మరొకరికి చూపు వచ్చే అవకాశం ఏర్పడింది. వృద్ధుడి నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ సర్పంచ్ సూర రజిత-వెంకటేశం, ఉప సర్పంచ్ బైరి సురేష్, వార్డు సభ్యురాలు సొల్లు సునీత తదితరులు అభినందించారు.