వానల్లేవ్.. పనుల్లేవ్.. వ్యవసాయ అనుబంధ రంగాలపైనా వర్షాభావ ప్రభావం
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన బెట్టడం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో ఎవుసం అంతంత మాత్రమే సాగుతున్నది. దాని ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతున్నది. వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతుండగా, పంటల సాగు గణనీయంగా తగ్గింది.
- మందకొడిగా సాగు పనులు
- ఉపాధి కోల్పోతున్న కార్మికులు
హుజూరాబాద్రూరల్, జూలై 12 : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన బెట్టడం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో ఎవుసం అంతంత మాత్రమే సాగుతున్నది. దాని ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతున్నది. వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతుండగా, పంటల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో సీజన్లో కళకళలాడాల్సిన ఫర్టిలైజర్స్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు, మెకానిక్లు, ఆటోస్టోర్ యజమానులు, వెల్డింగ్షాపుల నిర్వాహకులు, వ్యవసాయ కూలీలు వనులు లేక ఖాళీగా ఉంటున్నారు.
ఏటా విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద రైతుల సందడి కనిపించేంది. విత్తనాలు, ఎరువులు విక్రయాలతో దుకాణాలు కళకళలాడేవి. కానీ, ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. విత్తనాలు, ఎరువులు, మందుల కోసం వెళ్లే రైతుల సంఖ్య తగ్గింది. ఫలితంగా దుకాణాలు వెలవెబోతున్నాయి. వ్యవసాయం లేక ట్రాక్టర్లను యజమానులు ఖాళీగా ఉంచుతున్నారు. దీంతో వాటిపై తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా కొందరు డ్రైవర్లకు జీతాలు చెల్లిస్తూ ఎదురు చూస్తుండగా, రోజువారీ డ్రైవర్లు ఖాళీ ఉండాల్సి వస్తున్నది. ట్రాక్టర్లు ఖాళీగా ఉండడంతో మెకానిక్లకు కూడా పనులు దొరకడం లేదు. కేజ్వీల్స్, ప్లవ్లు, కల్టివేటర్ పనులు చేయించుకునే వారు లేక వెల్డింగ్ షాపుల నిర్వాహకులు ఖాళీ ఉంటున్నారు. దీంతో పూట గడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. వ్యవసాయంపై ఆధార పడ్డ ఆటోస్టోర్లు వెలవెలబోతున్నాయి. మోటర్ వైండింగ్ మెకానిక్లు, రోజువారీ వ్యవసాయ కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
నెల రోజుల నుంచి పని లేదు
గత నెల రోజుల నుంచి ఎలాంటి పని లేదు. గతంలో వర్షాలు ముందుగా రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి నీళ్లు వచ్చేవి. అక్కడి నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయడం వల్ల అయకట్టు కింద ఉన్న పొలాలు దున్నేవారు. దీంతో ట్రాక్టర్ల కేజీవీల్స్, కల్టివేటర్లు చెడిపోతే మరమ్మతుల కోసం రైతులు వచ్చేవారు. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు రూ.4 లక్షల వరకు సంపాదించే వాడిని. ప్రస్తుతం రూ.లక్ష కూడా సంపాదించలేదు.
– పరమేశ్, వెల్డర్ కిరాయి
ఎల్లడం లేదు
గతంలో ఎరువుల బస్తాలకు రైతులు క్యూ కట్టేవారు. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక ఉండేది కాదు. రైతులతో షాపు కళకళలాడేది. మంచి గిరాకీ ఉండేది. వర్షాలు కురువక పోవడం, కాల్వ నీళ్లు రాకపోవడంతో రైతులు పనులు ప్రారంభించడం లేదు. గిరాకీ లేదు. దీంతో రూం కిరాయి, కరెంటు బిల్లు కట్టలేక పోతున్నాం.
– గోపగాని అనిల్, ఫర్టిలైజర్ షాపు యజమాని
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

