గంభీరావుపేట, మే 3: రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేలు కేంద్రం నుంచి అందించి నష్టపోయిన వారిని ఆదుకోవాలని సూచించారు. ఆ మేరకు కేంద్ర ప్ర భుత్వం నుంచి ప్రకటన వచ్చేలా చేసి గ్రామాల్లో పర్యటించాలని హితవు పలికారు. గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ మంగళవారం నాలుగు మండలాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించిన రైతులకు ధైర్యం కల్పించారన్నారు. రైతుల శ్రేయస్సు కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం మంజూరుకు ప్రకటన చేశారన్నారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖ, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారని, ఇప్పటికే జిల్లాలోని సుమారు 20 వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక అందించారని గుర్తుచేశారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారని, రైతులు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. అసైన్డ్, పోడు భూముల్లో నష్ట పోయిన పంటలకు కూడా నష్ట పరిహారం ప్ర భుత్వం అందిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా ప్ర భుత్వం మద్దతు ధరను అందించి ధాన్యాన్ని కొ నుగోలు చేయడం లేదన్నారు. ఎఫ్‌సీఐ వద్దన్న రాష్ట్ర ప్రభుత్వం నష్టాలను భరిస్తూ రైతులు పం డించిన ప్రతి గింజనూ ఎనిమిదేండ్లుగా కొంటు న్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. యాసంగిలోని దేశంలోని సుమారు 27 రాష్ర్టాల్లో 97 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేస్తే కేవలం ఒక్క తె లంగాణ రాష్ట్రంలో 56 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అవుతున్నదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 12 క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఏ పార్టీ అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తుందన్నారు. రైతులు అధైర్య పడవద్దని, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి ప్ర భుత్వమని కొండూరి చెప్పారు. ఈ కార్యక్రమం లో కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామి గౌడ్, జడ్పీకో ఆప్షన్ అహ్మద్, నేతలు లింగన్నగారి దయాకర్‌రావు, గంద్యాడపు రాజు, మహబూబ్ అలీ, కరువారి శంకర్, కొత్తింటి హ న్మంతరెడ్డి, గోగు లింగంయాదవ్, దోసల రాజు, శేఖర్‌గౌడ్, రాజిరెడ్డి, వహీద్, రత్నాకర్, అభిలాశ్ తదితరులు ఉన్నారు.