గంగాధర, ఫిబ్రవరి 26: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రైతుల కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంర్భంగా ఫార్మర్ రిజిస్ట్రీపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏఈవో గోపీచంద్ మాట్లాడుతూ భూమి ఉన్న ప్రతి రైతులు ఈనెల 28వ తేదీలోగా రైతు గుర్తిపు కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కార్డు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వ్యవసాయ లబ్ది సులభంగా పొందవచ్చన్నారు.
పీఎం కిసాన్, బ్యాంక్ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకొని ఉండాలన్నారు. రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లించి గాని, రైతు వేదికల్లోని ప్రత్యేక శిబిరాల్లో గాని ఉచితంగా వ్యవసాయ విస్తరణాధికారి ద్వారా నమోదు చేయించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం సర్పంచ్ చౌడబోయిన ఉమ, రైతులు పాల్గొన్నారు.