International Yoga Day | గోదావరిఖని : పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా-1 లోని అన్ని గనులు డిపార్ట్ మెంట్లలో ముందస్తు సాముహిక యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయంలో ఉద్యోగులు అధికారులతో సాముహిక యోగా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ-1 ఏరియా జీఎం డీలలిత్ కుమార్ మాట్లడుతూ ప్రతీ ఒక్కరూ నిత్య జీవితంలో యోగాకు రోజుకు ఒక్క గంట సమయం కేటాయిస్తే ఏలాంటి జబ్బులు దరిచేరవని యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఈ యోగా ద్వారా భారత దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించదని సంస్థలో పని చేయుచున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్, మెనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం (ఐఆర్ఎస్) ఇట్టి కార్యక్రమం సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం సంతోషించదగిన విషయమని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రధాయినిగా నిలుస్తున్నదని, దీనిని అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరి చేత యోగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఆలాగే ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్ మెంట్స్ లలో ఉద్యోగులచే సాముహిక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, సీఎంఓఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, జీఎం ఆఫీస్ ఇంచార్జ్ రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పీవో హనుమంత రావు, ఫిరోజ్ ఖాన్, జీఎం ఆఫీస్ సిబ్బంది, యోగా శిక్షకులు అన్నపూర్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.