పేదల పెన్నిధి.. అభివృద్ధి ప్రదాత మంత్రి గంగుల కమలాకర్పై అభిమానం ఉప్పొంగిం ది. ఆయన జన్మదినాన్ని ముదిరాజ్ కులస్తులు వినూత్నంగా నిర్వహించారు.
కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు ఆధ్వర్యం లో పద్మనగర్ వద్ద మానేరు జలాశయంలో తెప్పలపై ‘హ్యాప్పీ బర్త్డే గంగుల కమలాకర్ అన్న’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి గంగుల, కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యోలతో వర్ధిల్లాని ఆకాంక్షించారు.
– కొత్తపల్లి, మే 8