Additional DCP | గంగాధర, జులై 14 : కరీంనగర్ జిల్లా గంగాధర మండల పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ అడిషనల్ డీసీపీ భీమ్ రావ్ సోమవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. భవనం నిర్మించిన భూమి వివరాలు, స్టేషన్ లో పట్టుకుని ఉంచిన వాహనాలు, వాటి వివరాలు, ప్రమాదానికి గురైన వాహనాల వివరాలు, పోలీస్ స్టేషన్ లో అమలు చేస్తున్న 5-ఎస్ విధానం, స్టేషన్ రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ లో ఉన్న క్వార్టర్స్ ఉపయోగంలో ఉన్నాయా..? లేదా..? అనే వివరాలు, పోలీస్ స్టేషన్ కి నీటి సరఫరా, కరెంటు సరఫరా, సీసీటీవీల పనితీరు, మొక్కల పెంపకం, స్టేషన్ కి కేటాయించిన ప్రాపర్టీ వివరాలు, పోలీసు వాహనాల పనితీరు, స్టేషన్ పరిసరాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో గంగాధర ఎస్సై వంశీ క్రిష్ణ, ఆర్ ఎస్సై తిరుపతి, ఏఎస్సైలు మల్లేశం, భగవాన్ రెడ్డి, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.