KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 9 : జిల్లాకేంద్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించారు. భగత్‌నగర్‌లో గల ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం అకస్మికంగా వెళ్ళి. సిబ్బంది హాజరు రిజిస్టరు తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శాఖ పరిధిలోని పలు ప్రభుత్వ పథకాల అమలులో సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఆశాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్, మిషన్ వాత్సల్య, మహిళా సాధికారత విభాగాల్లో తిరుగుతూ, రిజిష్టర్లు పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, సెక్షన్ ఇంచార్జిలు, విభాగాల బాధ్యులు, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట డిడబ్ల్యువో సబిత, ఇతర సిబ్బంది ఉన్నారు.