Chigurumamidi | చిగురుమామిడి ఆగస్టు 20 : చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ తానాజీ వాకడే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గదులను పరిశీలించి విద్యార్థులకు మోటివేషన్ క్లాసు నిర్వహించారు. కళాశాలలో జరుగుతున్న మైనర్ పనులను పరిశీలించారు.
సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రిన్సిపల్ శశిధర్ శర్మకు సూచించారు. వీరి వెంట మండల పరిషత్ సూపరిండెంట్ కాజామొహీనుద్దీన్, అధ్యాపకులు ఇల్లందుల సంపత్ కుమార్, జనార్ధన్, రవికుమార్, గోవర్ధన్ రెడ్డి, మహేందర్, లైబ్రేరియన్ చంద్రశేఖర్, కృష్ణమోహన్‌రావు, స్వరూప రాణి, మమతా, కవిత, వల్లి పాషా, తిరుపతి తదితరులున్నారు.