ఆర్టీసీని లాభాల బాట పట్టించాలి
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని డిపో మేనేజర్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జోనల్ పరిధిలో ట్రాఫిక్ విభాగం
- ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
- రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడుపాలి
- ఆర్టీసీ జోనల్ ఈడీ వెంకటేశ్వర్లు
తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 8: ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని డిపో మేనేజర్లకు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జోనల్ పరిధిలో ట్రాఫిక్ విభాగంలో పని చేసి ఉద్యోగోన్నతి పొందిన డీఎంలకు బుధవారం జోనల్ వర్క్‌షాపులో డిపోల నిర్వహణపై వరంగల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ఏఎంఈ మోహన్‌రావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం బస్టాండ్ కాంప్లెక్స్‌లోని ఈడీ కార్యాలయంలో డిపో మేనేజర్లతో సమీక్షా సమాశం నిర్వహించారు. ప్రయాణికులే సంస్థకు నిధి అని, వారితో మర్యాదగా వ్యవహరించాలని కోరారు. ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీకి అనుగుణంగా అవసరమైతే అదనపు బస్సులను నడుపాలని నిర్దేశించారు.
బస్సుల నిర్వహణ, డిపో మెకానిక్, ఫోర్మెన్స్ ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు జనగాం-జ్యోత్స్న, నర్సంపేట విజయమాధురి, తొర్రూర్-పరిమళ, సత్తుపల్లి- రాజ్యలక్ష్మి, మణుగూర్-టీ స్వామి, ఆర్మూర్- కవిత, బోధన్-టీఎస్ స్వామి, ఆదిలాబాద్- కే కవిత, మంచిర్యాల- రవీంద్రనాథ్, ఈడీ సెక్రటరీ యుగేంధర్‌రెడ్డి, మెకానికల్ సూపర్వైజర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

