ది-100 నేడే విడుదల.. ఈసారి ఐపీఎస్ పాత్రలో మెప్పించబోతున్న ఆర్కే సాగర్
మొగిలి రేకులు సీరియల్‌తో తెలుగు ప్రజలను మెప్పించి చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసి సినీ నటుడుగా రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆర్.కే సాగర్ తాజాగా నటించిన మరో సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కోల్ సిటీ, జూలై 10 : మొగిలి రేకులు సీరియల్‌తో తెలుగు ప్రజలను మెప్పించి చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసి సినీ నటుడుగా రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆర్.కే సాగర్ తాజాగా నటించిన మరో సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పూర్తి యాక్షన్ మూవీగా ది-100 సినిమాలో ఈసారి ఐపీఎస్ పాత్రలో సాగర్ నటించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సాగర్ నటించిన నాలుగో చిత్రం ఇది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో వస్తున్న ది- 100 సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇదే సినిమాలో గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల ఒక శాస్త్రీయ నృత్యంతో కూడిన పాటకు కొరియోగ్రాఫర్ అవకాశం దక్కించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కాబోతున్న ది-100 సినిమాలో గోదావరిఖనికి చెందిన సినీ నటుడు ఆర్కే సాగర్ హీరోగా నటించడం, ఇదే సినిమాలో స్థానిక కళాకారిణి ఉజ్వల ఒక పాటకు కొరియోగ్రాఫర్ గా పని చేయడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ షోను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు విడుదల చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని న్యూ అశోక థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాను అభిమానులు ఆదరించి మంచి విజయం అందించాలని సినీ అభిమానుల ఐక్య వేదిక సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ అభిమానులను కోరారు. ఈ ప్రాంతంకు చెందిన సినీ నటుడు సాగర్ నటించిన ది-100 సినిమా తప్పకుండా మంచి హిట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు .
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్స్ అండ్ గైడ్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన గవర్నర్
డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

