శంకరపట్నం, మార్చి 23: అనుమతుల్లేని వెంచర్లు, లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని ఓ వెంచర్‌పై ఫిర్యాదులు రాగా డీపీవో వీరబుచ్చయ్యతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదరు వెంచర్‌కు డీటీసీపీ పూర్తిస్థాయి అనుమతులు లేకపోవడంతో ప్రహరీని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెంచర్ నిర్వాహకుల విజ్ఞప్తితో అనుమతుల దరఖాసుకు రెండు రోజుల గడువునిచ్చారు. అక్రమ వెంచర్లపై పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ’మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల, ఎస్సీ,బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆయా పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. హైస్కూల్లో స్కావెంజర్‌ను నియమించాలని ఆదేశించారు. అనంతరం కాలనీలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో వీరబుచ్చయ్య పారిశుధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కారోబార్లు గురువయ్య, సదానందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ డీఎల్పీవో లత, ఎంపీవో సురేందర్, పంచాయతీ కార్యదర్శి గురవయ్య, రెవెన్యూ, పంచాయితీరాజ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.