Veenavanka | వీణవంక, మే 30: మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై సౌమ్య హెచ్చరించారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదుల మేరకు మండలంలోని వైన్స్ షాప్ లలో, బేతిగల్, కోర్క ల్ గ్రామాలలో బెల్ట్ షోలలో ఎక్సైజ్ ఎస్ఐ సౌమ్య శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు 16 లిక్కర్ కేసులు నమోదు చేసి, 67 లీటర్ల లిక్కర్ పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ మద్యం అమ్మకాలు, అధిక ధరలకు విక్రయించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.